Telugu Judgments in High Courts: A Game-Changer for Legal Accessibility
Judgments in Telugu are a game changer for Telugu advocates, litigants and students.

తెలుగు వెర్షన్ క్రింద ఇవ్వబడింది.
As a law student, if you don't scratch your head when you are reading some judgments from Supreme Court, you must be an enlightened soul. For the rest of us, we need some support. This is where the initiative by the Supreme Court comes in. You now have access to many judgments of Supreme Court and AP and TG High Courts in Telugu.
What's Happening?
In August 2023, the Supreme Court of India directed all High Courts to translate their important judgments into regional languages. This groundbreaking directive aims to make justice truly accessible to common people who speak Telugu.
Through 2 RTIs I filed, I got the data on this.
Both AP and Telangana High Courts have embraced this mission with impressive results:
Telangana High Court has already translated over 4,800 judgments into Telugu:
- 3,217 Supreme Court judgments
- 1,645 High Court judgments
Andhra Pradesh High Court has established a comprehensive translation scheme with dedicated teams of translators and retired judges ensuring quality translations. They did not provide the actual data but the judgments are available for everyone to see.
Why This Matters for Telugu Students
Breaking the English Barrier: Legal concepts that seemed impossible to grasp in English become clear when explained in Telugu. Constitutional law, criminal procedure, and civil rights - all become accessible. This changes everything.
Better Legal Education: Law students can now study landmark judgments in their native language, leading to an in-depth understanding of the subject and superior performance.
Practical Applications: When you are from a native Telugu background with limited exposure to English, having content explained in Telugu makes a light and day difference in the level of your understanding of the subject.
Real-World Impact: Government employees, police officers, and local administrators can now better understand and implement court directions when they're available in Telugu.
The Technology Behind It
Both courts use AI-powered tools like SUVAS (Supreme Court Vidhik Anuvad Software) for initial translation, followed by human experts who ensure accuracy and legal precision. This hybrid approach combines speed with quality and is supposed to get the best results. Although I have my reservations, it is a positive step in the right direction.
Long-term Benefits
This initiative will create a generation of Telugu speakers who are more legally aware and empowered. Students today will become tomorrow's advocates, judges, and administrators who can seamlessly work in both English and Telugu, making justice truly accessible to all.
As more judgments get translated, we'll see:
- Improved legal literacy in rural areas
- Better implementation of court orders by local officials
- Enhanced legal research capabilities in Telugu
- Stronger connection between law and local culture
How RTI Made This Story Possible
This information didn't come from press releases or government announcements. It came from simple RTI applications filed by 1516 to know the status of Telugu judgments in their High Courts.
The power of RTI lies in its simplicity - for just Rs 10 (or free through some platforms), any student can get detailed information about government initiatives, college facilities, scholarship programs, or any public matter that affects them.
Why 1516 Published This?
At 1516, we believe this development is crucial for our Telugu student community for several reasons:
1. Breaking the Language Barrier: Many Telugu students are unable to read and understand judgments in English. Judgments have superior levels of English that are used to emphasise the point. While this is admirable, it is often this language that creates the barrier between ordinary citizens and the courts. Translations into Telugu would greatly help them understand the interpretation of the law by Superior courts.
2. The Power of Filing an RTI: The power of filing an RTI, especially a correct RTI, is highly underrated. You, as a student today can file an RTI from any part of the country with a cost less than Rs 50. If using official online portals, cost is Rs 10 or if using YouRTI, cost is 0.
3. Building Future Leaders: Learning to file RTIs early on in student life helps you become a powerful weapon of mass impact as you age. The person who knows how to file an RTI today, will be able to deal with complex matters tomorrow.
4. Our Challenge to Students: We at 1516 encourage students to file at least 1 RTI per month. Especially about those things that matter to you personally. Here are some example RTIs filed by me
- How many times do you close the Railway Gate at Chirala (CLX) on the Karamchedu road?
- How many times does the Railway gate close at Chinna ganjam (CJM) and for how many minutes?
- Railway stalls at Chirala Railway Station (CLX)?
- Railway stalls at Begumpet Railway Station (BMT)?
- Is ICAR accreditation mandatory for the B.Sc Agriculture degree?
- Toll gate details and Contractor details for Hyderabad to Vijayawada Toll gates
You can access the RTIs that I filed using YouRTI below
- Telangana High Court RTI for Telugu Language judgments
- Andhra Pradesh High Court RTI for Telugu Language judgments
Judgments being translated into Telugu are a step forward in the right direction, it opens up the judgments to a larger segment of the population and opens the doors of the legal system to them.
Please find below certain judgments in Telugu. You can easily find them on the APHC and TGHC websites.
- SC by TG - State of Telangana v. Mohd Abdul Kasim
- SC by TG - Tajveer Singh Sodhi v. State of JK
- TG - Kalluri Naga Narasimha Abhiram v. State of Telangana
- TG - Kalluri Naga Narasimha Abhiram v. State of Telangana
- AP - Adani Ports SEZ Ltd v. Vishaka Ports Trust
- AP - Celkon Impex Pvt Ltd v. State of AP
Note: While judgments are being provided in Telugu, they hold no legal value, they are only for ease of understanding. This means that if you want to dispute the judgment, you must use only the English version.
హైకోర్టుల్లో తెలుగు తీర్పులు: న్యాయాన్ని అందుబాటులోకి తెచ్చే విప్లవాత్మక చర్య
ఒక లా విద్యార్థిగా సుప్రీంకోర్టు తీర్పులు చదువుతుంటే మీకు తలనొప్పి రాకపోతే, మీరు నిజంగా ప్రతిభావంతులే!
మనలో ఎక్కువమంది అలాంటివారు కాదు కాబట్టి తీర్పులు అర్ధం చేసుకోవడంలో కొంచెం సహాయం అవసరం పడుతుంది. ఇలాంటి సందర్బంగా సుప్రీంకోర్టు తీసుకున్న కొత్త నిర్ణయం మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టుల ముఖ్యమైన తీర్పులు తెలుగులో అందుబాటులో ఉన్నాయి.
అసలేంటి సంగతి?
ఆగస్ట్ 2023లో సుప్రీంకోర్టు ఒక కీలక ఆదేశం జారీ చేసింది. అందులో అన్ని హైకోర్టులు తమ ముఖ్యమైన తీర్పులను స్థానిక భాషల్లోకి అనువదించాలని ఆదేశించింది. దీని వల్ల న్యాయం సాధారణ తెలుగు ప్రజలకు కూడా అర్థమయ్యే స్థాయికి చేరుతుంది.
నేను రెండు ఆర్టీఐల ద్వారా దీనికి సంబంధించిన సమాచారం సంపాదించాను.
-
తెలంగాణ హైకోర్టు ఇప్పటికే 4,800కి పైగా తీర్పులను తెలుగులోకి అనువదించింది:
-
3,217 సుప్రీంకోర్టు తీర్పులు
-
1,645 హైకోర్టు తీర్పులు
-
-
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రత్యేకంగా అనువాద విభాగం ఏర్పాటు చేసి, అనువాదకులు మరియు రిటైర్డ్ జడ్జీలతో క్వాలిటీ చెక్ చేస్తున్నారు. సంఖ్య తెలియజేయలేదు కానీ, అనువాద తీర్పులు అందుబాటులో ఉన్నాయి.
అసలు తీర్పులు తెలుగులో ఎందుకు అవసరం?
-
ఆంగ్లంలో ఉన్న అడ్డంకి తొలగింపు: ఆంగ్లంలో క్లిష్టంగా ఉన్న న్యాయపరమైన విషయాలు తెలుగులో సులభంగా అర్థమవుతాయి. రాజ్యాంగం, క్రిమినల్, సివిల్ లా – ఇవన్నీ మన భాషలో స్పష్టంగా తెలుస్తాయి.
-
మెరుగైన విద్య: లా విద్యార్థులు ల్యాండ్ మార్క్ తీర్పులను తెలుగులో చదివి బాగా అర్థం చేసుకోవచ్చు. ఇది పరీక్షల్లోనూ, ప్రాక్టికల్ లా నేర్చుకోవడంలోనూ ఎంతో ఉపయోగపడుతుంది.
-
నిజ జీవితంలో ప్రయోజనం: ఆంగ్లం బాగా రాని ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, స్థానిక అధికారులు కూడా కోర్టు ఆదేశాలను తెలుగులో చదివి అమలు చేయగలరు.
దీని వెనుక ఉన్న సాంకేతికత
SUVAS (Supreme Court Vidhik Anuvad Software) లాంటి ఏఐ టూల్స్ ఉపయోగించి ముందుగా అనువాదం చేస్తారు. తర్వాత మనుషులే చూసి సరిచేసి, ఖచ్చితమైన లీగల్ అనువాదం ఇస్తారు. ఈ విధానం వేగాన్ని, నాణ్యతను కలగలిపి పనిచేస్తుంది.
దీర్ఘకాల ప్రయోజనాలు
ఈ చొరవతో రాబోయే తరం తెలుగు యువత మరింత న్యాయవేత్తలు, అధికారులు, జడ్జీలు అవుతారు. తెలుగు, ఆంగ్లంలో ఇలా రెండు భాషల్లో సమానంగా పని చేయగలరు.
ఇంకా ఇది ఇలా మారుస్తుంది:
-
గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ పరమైన అవగాహన పెరుగుతుంది
-
కోర్టు ఆదేశాల అమలు తీరు మెరుగవుతుంది
-
తెలుగులో లీగల్ రీసెర్చ్ సులభం అవుతుంది
-
న్యాయం-సాంస్కృతిక సంబంధం బలపడుతుంది
RTI పవర్ ఏమిటంటే
ఈ సమాచారం ఎక్కడా ప్రెస్ నోట్‌లో లేదు. ఇది నేను వేసిన సాదాసీదా ఆర్టీఐల ద్వారా వచ్చింది.
కేవలం ₹10 ఖర్చుతో మీరు కూడా ఏదైనా ప్రభుత్వ విషయంపై సమాచారం పొందవచ్చు. ఇది విద్యార్థులకు అమూల్యమైన సాధనం.
1516 ఎందుకు పంచుకుంటోంది?
1516 ద్వారా మేము ఇలాంటివి ఎందుకు పంచుకుంటున్నామంటే:
- భాష అడ్డంకి తొలగింపు: తీర్పులు ఉన్నత స్థాయి ఆంగ్లంలో ఉంటాయి. వాటిని తెలుగులో చదివితే అందరికీ అర్థమవుతాయి.
- RTI శక్తి: కరెక్ట్ RTI వేయడం గొప్ప పద్ధతి. ప్రతీ విద్యార్థి నెలకి కనీసం ఒక RTI వేయాలి.
- భవిష్యత్తులో నాయకులు: RTI వేయడం తెలిసిన విద్యార్థి రేపు ఎలాంటి సమస్యలైనా పరిష్కరించగలడు.
నేను వేసిన కొన్ని RTI ఉదాహరణలు:
-
చీరాల రైల్వే గేటు ఒక రోజులో ఎన్ని సార్లు మూసివేస్తారు?
-
చినగంజం రైల్వే గేటు ఒక రోజులో ఎన్ని సార్లు మూసివేస్తారు?
-
చీరాల రైల్వే స్టేషన్‌లో స్టాళ్లు ఎవరికి ఇచ్చారు?
-
ICAR Accrediation B.Sc Agriకి తప్పనిసరి కావాలా?
-
హైదరాబాద్ – విజయవాడ టోల్ గేట్ల కాంట్రాక్టర్ వివరాలు?
మీరు కూడా చూడండి:APHC TSHC
తెలుగు తీర్పులు:
- SC by TG - 2024-తెలంగాణా రాష్ట ప్రభుత్వం మరియు అదర్స్ వర్సెస్ మహామంద్ అబ్దుల్ కాసీం
- SC by TG - 2023- తజ్ వీర్ సింగ్ సోది వర్సెస్ జమ్మూ కాశ్మీర్
- TG HC - 2024- కల్లూరి నాగ నరసింహ అభిరాం వర్సెస్ తెలంగాణా రాష్టం
- AP HC - 2022- అదాని పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్స్ లిమిటెడ్ వర్సెస్ డి విషక పోర్ట్స్ ట్రస్ట్
- AP HC - 2022-సేల్కన్ ఇంప్లేక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్టం
గమనిక: తెలుగులో ఉన్న తీర్పులు మార్గదర్శకానికి మాత్రమే. లీగల్‌గా ఎప్పుడూ ఆంగ్ల తీర్పే చెల్లుబాటు అవుతుంది.
ఇలా తీర్పులను తెలుగులోకి అనువదించడం న్యాయాన్ని ప్రతి ఒక్కరికీ చేరువ చేస్తుంది. RTIలు వాడి మీ పరిధిలోని సమస్యలకు సమాధానాలు కనుగొనండి. ఇది మన భవిష్యత్తు!
1516తో అందరికి అందుబాటులోకి న్యాయం!